
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్రెడ్డి. ఈ మేరుకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అటు ప్రజా భవన్ లో భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేకును డిప్యూటీ సీఎం కట్ చేశారు. పార్టీ శ్రేణులు అభిమానుల రాకతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. అంతకుముందు ప్రజా భవన్ లోని పోచమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు భట్టి విక్రమార్క.