ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి... ఎల్ నినో టైంలో ఎవరూ నిర్లక్ష్యం చేయద్దు: సీఎం రేవంత్ 

ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి... ఎల్ నినో టైంలో ఎవరూ నిర్లక్ష్యం చేయద్దు: సీఎం రేవంత్ 

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ( అక్టోబర్ 15 ) ఎల్ నినో ప్రభావంపై మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని.. ఎల్ నినో టైంలో ఎవరు నిర్లక్ష్యం చేయద్దని అన్నారు సీఎం రేవంత్. ఎల్ నినో కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి, ఎండ వేడిమి ఉందని అన్నారు.

భూమిపై నివసించే ప్రతి ప్రాణిపై ఎల్ నినో ప్రభావం ఉందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం పెరిగిందని.. అక్టోబర్ లో 15వేల మెగావాట్ల వినియోగం ఉండాల్సింది 20 వేల మెగావాట్లకు పెరిగిందని అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 6 నుంచి 7వేల మెగావాట్ల ఉందని... ప్రస్తుతం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. కొందామన్నా మార్కెట్లో విద్యుత్ లేదని అన్నారు సీఎం రేవంత్.

మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజలను ఎల్ నినోపై అప్రమత్తం చేస్తున్నారని.. రైతులకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు సీఎం రేవంత్. దేశాన్ని రైతులే కాపాడుతున్నారని అన్నారు. నీళ్లు ప్రస్తుతం అందుబాటులో లేవని.. నీళ్లను పొదుపుగా వాడుకోవాలని అన్నారు సీఎం రేవంత్. రైతులు ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలని అన్నారు సీఎం రేవంత్.

ఈ సమయంలో ఎవరైనా రైతులు నిర్లక్ష్యంతో వరి పంటలు వేస్తే పెద్ద ప్రమాదమేనని అన్నారు సీఎం రేవంత్. ఈ ఒక్కసారి పంటలు వేయడం మానుకోవాలని అన్నారు.రైతులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని.. భూమి లేని పెదలను ఉపాధి హామీతో ఆదుకోవాలని అన్నారు రేవంత్. ఉపాధి హామీతో కూలీలను ఆదుకోవాలని.. ప్రకృతి వైపరీత్యాల టైంలో కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం రేవంత్.