హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు,టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నెల్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షాపిరో, సినీ నటుడు రానా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. నెట్ ఫ్లిక్స్ సంస్థను హైదరాబాద్ కు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో కంపెనీల స్థాపనకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.
అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ముంబై తర్వాత ఇది రెండో ఆఫీసు. హైటెక్ సిటీలో క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్ ఏలో 40వేల చదరపు అడుగుల ఈ ఆఫీస్ ఏర్పాటు చేసింది.
►ALSO READ | గ్యాస్ కొరత..కట్టెలకు పెరిగిన డిమాండ్.. క్వింటాల్ కు రూ. 1500 నుంచి రూ. 2 వేలు
ప్రపంచ కార్యకలాపాలకు ఈ ఆఫీసు బ్యాక్ బోన్ మాదిరిగా ఉండబోతుంది. నగరంలోని బలమైన టెక్ ఇన్ ఫ్రా, టాలెంటెడ్ యువత ఈ నిర్ణయానికి కారణంగా చెబుతోంది స్ట్రీమింగ్ కంపెనీ. నెట్ ఫ్లిక్స్ రాకతో వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ కేంద్రం ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ టెక్ ద్వారా ఎడిటింగ్, యానిమేషన్, రెండరింగ్ సేవలను చూసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ రాక హైదరాబాద్ టెక్ కేంద్రంగా మారుతున్న వేగాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
