కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్ఛరణల మధ్య జమ్మిచెట్టుకు సీఎం రేవంత్ పూజలు చేశారు. శమీ పూజ చేసి కోరిక రాశారు.
శమీ పూజ కోరిక రాసిన సీఎం రేవంత్ #cmrevanthreddy #Kondareddypalli #shamipooja #dasara https://t.co/x0nOJC5VHi
— V6 News (@V6News) October 20, 2026
కొండారెడ్డి పల్లి గ్రామస్తులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం.. కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దసరా వేడుకలలో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ వీక్షించారు. సీఎంతో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
శమీ పూజ కు బయలుదేరిన సీఎం #cmrevanthreddy #shamipooja #dasara https://t.co/GI8CiylZ8E
— V6 News (@V6News) October 20, 2026
ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఈ పండుగ ధైర్యం, ధర్మం, సత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు.
మనలోని అహంకారం, అసూయలను తొలగించుకుని, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జమ్మిచెట్టును పూజించి, ఆకులను బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకునే మన సంప్రదాయం ప్రకృతిని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని వివరించారు.
