తుమ్మిడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల భేటీ

తుమ్మిడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల  భేటీ


మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో సీఎం రేవంత్ రెడ్డి  సమావేశం కొనసాగుతోంది.   సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్లో మహారాష్ట్ర సీఎ -దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ఎత్తుపై చర్చి్స్తున్నారు. 

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 ఆగస్టు 23న కుదుర్చుకున్న ఒప్పందంలో బ్యారేజీ నీటిమట్టాన్ని కేవలం +148 మీటర్లకే పరిమితం చేసి, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపైనే శ్రద్ధ పెట్టి తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కన పడేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు సాగు, తాగునీటి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా గరిష్ట నీటిని తరలించి, విద్యుత్ వ్యయాన్ని తగ్గించేలా +152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని సర్కారు పట్టుబడుతోంది.  ఈ దిశగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 29న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. దీంతో మే 6న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనంతరం మే 26న సీఎం రేవంత్మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖలు రాశారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావంపై చర్చలకు సమయం కోరారు. ఈ క్రమంలోనే ఇవాళ ముంబైలో భేటీ అయ్యారు.