పెళ్లివేడుకలో ఆడిపాడిన సైనికులు

పెళ్లివేడుకలో ఆడిపాడిన సైనికులు

ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా లో స్థానికులతో కలిసి సైనికులు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిన్పా గ్రామంలోని ఓ వివాహ వేడుకలో గిరిజనులు వారి సంప్రదాయ శైలిలో పాటలు పాడుతూ నృత్యం చేశారు. అయితే అక్కడకు చేరుకున్న కోబ్రా 206 బెటాలియన్ కు చెందిన సైనికులు వారితో కలిసి డ్యాన్స్ చేశారు. సైనికులు తమతో కలిసి డ్యాన్స్ చేయడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.