CJParty Protest Reaches Cricket: నీట్ పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్దెత్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ముంబైలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయ. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిరసనలపై స్పందించి చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఒక వినూత్న ప్రచారం చేస్తున్నారు. భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు కూడా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
గంభీర్, అగార్కర్‌లపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్:
సోషల్ మీడియాల్లో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లు వెంటనే రాజీనామా చేయాలనే ట్రెండ్ ఊపందుకోవడానికి ప్రధానంగా అభిమానుల తీవ్ర అసంతృప్తే కారణం. ఎందుకంటే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పట్ల గంభీర్, అగార్కర్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల కాలంలో స్వదేశంలో, విదేశాల్లో భారత జట్టు దారుణమైన సిరీస్ ఓటములను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వ్యంగ్య ప్రచారం కేవలం అభిమానుల ఆవేదనను తెలియజేసే ఒక సరదా ప్రక్రియ మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం భారత క్రికెట్ మేనేజ్‌మెంట్, కోచింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. కాగా, ఈ నెటిజన్ల ట్రెండ్‌పై గంభీర్, అగార్కర్ లేదా బీసీసీఐ (BCCI) ఇంకా రియాక్ట్ కాలేదు.
విద్యార్థుల నిరసనలపై స్పందించిన దిగ్గజ క్రికెటర్లు:
కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ జరుగుతున్న విద్యార్థుల ఉద్యమంపై భారత క్రికెట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు స్పందించడం విశేషం. సచిన్ టెండూల్కర్, శుభ్‌మన్ గిల్, హర్భజన్ సింగ్, సంజయ్ మంజ్రేకర్ లాంటి మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ఈ విద్యార్థి నిరసనలపై తమ అభిప్రాయాలను వెల్లడించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Ek protest hume bhi Krna chiye to remove gambhir and agarkar from odi set up 🙁
— ICT 💙 (@ROHIRAT_) July 24, 2026
Salman bhai aisa hi ek tweet chappal chor Gambhir aur Agarkar ke liye bhi kar do kya pata Indian cricket bach jaye please 🥺 pic.twitter.com/tTMgxgwcO9
— DUA HINDUSTANI 🇮🇳 (@Dua_Hindustani) July 24, 2026
