బాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌గా క్రేజ్ తెచ్చుకున్న చిత్రం ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2). షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ మూవీ ప్రమోషన్స్ అప్పుడే హీటెక్కించేశాయి. ఆదివారం (మే 17న) ముంబయిలో గ్రాండ్‌గా మ్యూజికల్ ఈవెంట్‌ను జరిగింది.. అయితే, ఈ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
స్టేజ్ పై రష్మిక బోల్డ్ కామెంట్..
ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ.. తోటి నటి కృతి సనన్ గ్లామర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆ ఫ్లోలో కాస్త ఎగ్జైట్ అయి.. "నువ్వు చాలా హాట్‌గా ఉంటావని ప్రపంచానికంతటికీ తెలుసు.. అండ్ యు ఆర్ సూపర్ హాట్" అంటూ నోరు జారేసింది. వెంటనే రియలైజ్ అయి షాక్ తిన్న రష్మిక.... అయ్యో సారీ.. మీడియా వారు దయచేసి దాన్ని ఎడిట్ (సెన్సార్) చేసేయండి.. నేను ఆ మాట అనలేదు అంటూ కవర్ చేస్తూ నవ్వేసింది. దాంతో స్టేజ్ మీదున్న షాహిద్, కృతితో పాటు ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు.
#RashmikaMandanna can't control to say this about #KritiSanon 🤯#Cocktail2 pic.twitter.com/sID3oIzyal
— cinee worldd (@Cinee_Worldd) May 18, 2026
సినిమా కథపై క్రేజీ రూమర్స్..
2012లో దీపికా పదుకొణె, డయానా పెంటి, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ 'కాక్టెయిల్'కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. అయితే ఈ పార్ట్-2లో కృతి, రష్మిక ఇద్దరూ స్వలింగ ప్రేమికులుగా (Lesbians) కనిపించబోతున్నారంటూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ టాక్ నడుస్తోంది. దీనిపై రష్మిక మాట్లాడుతూ.. "ఈ సినిమాలో మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఊహకు అందని ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు మీరు చూసింది చాలా తక్కువ" అంటూ హింట్ ఇచ్చింది.
హీరో షాహిద్ కపూర్ కూడా మాట్లాడుతూ.. నా క్యారెక్టర్ (కునాల్) ఈ ఇద్దరు అందగత్తెలలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక తలపట్టుకుంటుంది.. అదే ఈ సినిమా అసలు కథ అని లీక్ ఇచ్చాడు. రష్మికతో వర్క్ చేయడంపై చెప్తూ.. తన ఆన్-స్క్రీన్ స్పాంటేనిటీకి ఫిదా అయిపోయానని, అందుకే రష్మిక- తన మధ్య కెమిస్ట్రీ మ్యాజికల్‌గా వచ్చిందని షాహిద్ చెప్పుకొచ్చాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 29న రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.
Rashmika Mandanna and Kriti Sanon at Cocktail 2 Music Launch Event 🩶🤍🥰#Rashmika #RashmikaMandanna#Kriti #KritiSanon #Cocktail2 pic.twitter.com/rBdpHex4pC
— glam (@Glamreel) May 18, 2026
'మషూకా', 'తుజ్కో' పాటల లాంచ్
ఈ ఈవెంట్లో మేకర్స్ రెండు క్రేజీ సాంగ్స్‌ను లాంచ్ చేశారు. షాహిద్-కృతిల కాంబినేషన్లో వచ్చే 'మషూకా', అలాగే షాహిద్-రష్మికల రొమాంటిక్ సాంగ్ 'తుజ్కో'లను రిలీజ్ చేసి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్లో దర్శకుడు హోమీ అదజానియా, నిర్మాతలు దినేష్ విజన్, లవ్ రంజన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కూడా పాల్గొన్నారు. మొదటి భాగాన్ని ఇంతియాజ్ అలీ రాశారని, అందుకే పార్ట్-2ను మరింత బాధ్యతగా, భయపడుతూనే తీశానని లవ్ రంజన్ వెల్లడించారు. 2012 నాటి సూపర్ హిట్ 'కాక్టెయిల్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
