సాధారణంగా పిల్లల కోసం టాయ్స్ తయారుచేస్తుంటారు. కానీ, పెద్దవాళ్ల కోసం ఒక టాయ్ తయారుచేసింది కొకూన్‌కార్ట్ అనే కంపెనీ. ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు రిలీఫ్ ఇచ్చేందుకు ఈ గాడ్జెట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడిపే ఉద్యోగులకు ఇది ఒక గొప్ప రిలాక్సేషన్ టూల్ అని చెప్పొచ్చు. దీని డిజైన్ అసలైన మెకానికల్ కీబోర్డ్ బటన్‌ను పోలి ఉండటం వల్ల దీన్ని నొక్కినప్పుడు వచ్చే ‘క్లిక్’ అనే శబ్దం, చేతికి తగిలే స్పర్శ మనసుకు తృప్తిని ఇస్తాయి.
ఇందులో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు బటన్ నొక్కిన ప్రతిసారీ రంగురంగుల్లో మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీన్ని బైక్ కీలకు, బ్యాగులకు లేదా జేబులకు ఈజీగా తగిలించుకుని వెంట తీసుకువెళ్లొచ్చు. టెన్షన్‌గా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు లేదా ఏదైనా విషయంపై ఏకాగ్రత కుదరనప్పుడు ఈ చిన్న గాడ్జెట్‌తో ఆడుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఆట వస్తువులా మాత్రమే కాకుండా, చేతి వేళ్లకు ఒక మంచి వ్యాయామంలా, టేబుల్‌పై పెట్టుకోవడానికి ఒక అందమైన డెకరేషన్ పీస్‌లా కూడా ఉపయోగపడుతుంది.
