Chat-GPT: కోడెక్స్.. ఏఐ కోడింగ్ ఏజెంట్

Chat-GPT: కోడెక్స్.. ఏఐ కోడింగ్ ఏజెంట్

ఓపెన్ ఏఐ ఈ మధ్య చాట్​జీపీటీ లో కొత్త ఏఐ కోడింగ్ ఏజెంట్​గా కోడెక్స్​ను పరిచయం చేసింది. కంపెనీ దీన్ని క్లౌడ్ ఆధారిత సాఫ్ట్​వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్​గా చెప్తోంది. ఇది రాయడం, బగ్స్ సరిచేయడం, యూజర్ కోడ్ బేస్ గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి కోడింగ్​ రిలేటెడ్ పనులన్నీ ఒకేసారి చేయగలదు. ప్రతి పని ప్రాజెక్ట్ రిపోజిటరీతో ఇప్పటికే సెట్​అప్ అయి ఉంది.

 చాట్​జీపీటీ సైడ్​బార్ ద్వారా కోడెక్స్​ను యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ప్రాంప్ట్​ను ఎంటర్ చేసి కోడ్​ ఎంచుకోవడం ద్వారా కొత్త ప్రోగ్రామింగ్​ పనులను కేటాయించొచ్చు. కోడ్​ బేస్​ గురించి క్లారిటీ కావాలంటే ‘ఆస్క్​’ అనే ఆప్షన్​ మీద క్లిక్ చేయాలి.