
సీజనల్గా వచ్చే అనారోగ్య సమస్యలు ఐదారు రోజుల్లోనే తగ్గిపోతాయి. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏవైనా వచ్చినప్పుడు ఎప్పుడూ వాడే మందులు, సిరప్లు వాడితే చాలు. కానీ.. కొందరు యాంటీబయాటిక్స్ కూడా వాడుతుంటారు. అయితే.. నాలుగైదు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే యాంటీబయాటిక్స్ గురించి ఆలోచించాలి.
అప్పటికీ మెడికల్ షాప్కి వెళ్లి సొంతంగా కొనుక్కోకూడదు. డాక్టర్ సూచిస్తేనే వాడాలి. అంతేకాదు.. డాక్టర్ చెప్పిన కోర్స్పూర్తి చేయాలి. మధ్యలో వదిలేయకూడదు. నిజానికి విదేశాల్లో యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ దొరకవు. మన దగ్గర దొరుకుతున్నా యని చాలామంది విచ్చలవిడిగా వాడుతున్నారు. అలా వాడడం వల్ల వ్యాధి వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడినా ఎఫెక్టివ్‌గా పనిచేయదు.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎఫెక్ట్ అవుతారు. పిల్లలకు ఎందుకంటే.. వాళ్లు జాగ్రత్తలు సరిగా పాటించలేరు. పైగా ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి. కాబట్టి బయటికి వెళ్లినప్పుడో, వచ్చేటప్పుడో.. ఏదో ఒక టైంలో వర్షంలో తడుస్తుంటారు. దానివల్ల జలుబు, జ్వరం వంటివి చుట్టుముట్టేస్తాయి. ఒకరికి వచ్చిందంటే తోటి పిల్లలకు ఈజీగా వ్యాపిస్తుంటుంది. ఇలాంటప్పుడు పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
పెద్దవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల.. మనవళ్లు, ఇతరుల నుంచి వాళ్లకు వ్యాపి స్తుంటాయి. డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, కిడ్నీ, హార్ట్ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు ఎఫెక్ట్ అయితే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్లు ఫ్లూ, నూమోకోకల్ అనే రెండు వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ రాకుండా నివారించొచ్చు.