
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రైవేట్ హాస్పిటళ్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పమేలాసత్పతి హెచ్చరించారు. గురువారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీతో కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ నుంచి వెలువడే బయో కెమికల్, ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల నిబంధనలు పాటించాలన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కు పార్కింగ్ సౌకర్యం ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్వో వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎనమళ్ల నరేశ్ పాల్గొన్నారు.