తనదైన కామెడీ టైమింగ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు మహేష్ యాదవ్. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ గురించి మహేష్ యాదవ్ మాట్లాడుతూ ‘నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మా స్వగ్రామం. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు నాలోని నటుడిని గుర్తించి ‘ఈ నగరానికి ఏమైంది’లో అవకాశం ఇచ్చారు. అందులో నేను పోషించిన పాత్ర సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో బిజీ అయ్యాను.
కీడాకోల, ఓం శాంతి శాంతి, ప్రేమంటే, భామాకలాపం, సత్తిగాని రెండెకరాలు, రాజుగాడు, భీమ్లానాయక్, స్కై ల్యాబ్, అదర్వ, శభరి, ఉప్పుకప్పురంబు , మిత్రమండలి లాంటి చిత్రాల్లో నటించా. అలాగే రాముల, గాడ్సే అఫ్ ధర్మపురి, కుబుల్ హై, మాయాబజార్, శశి మధనం, శివరిపల్లి, సూపర్ సుబ్బు లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ మంచి పాత్రలు దక్కాయి.
‘లిటిల్ హార్ట్స్’లో కోటి సార్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘బద్మాషులు’ చిత్రంలో లీడ్ రోల్ చేశా. ప్రస్తుతం ఇరుముడి, ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నా. సమ్మర్ హాలిడేస్, మారెమ్మ, తక్షకుడు, టైసన్ నాయుడు సినిమాల్లోనూ నటించా. ఈ ఏడాది 30కి పైగా సినిమాల్లో నటించడం సంతోషంగా ఉంది. చిరంజీవి గారి స్ఫూర్తితో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు గార్లను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నా’ అని చెప్పారు.
