తిరుమల శ్రీవారి సేవలో హాస్య బ్రహ్మ ఫ్యామిలీ..

తిరుమల శ్రీవారి సేవలో హాస్య బ్రహ్మ ఫ్యామిలీ..

తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అందరికీ సుపరిచితమే. రీసెంట్గా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగిన విషయం తెలిసిందే. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం మే 21 ఆదివారం డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన ఐశ్వర్యతో ఘనంగా జరిగింది.

ఇక లేటెస్ట్గా హాస్య బ్రహ్మ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయనకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి స్పెషల్ దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక హాస్య బ్రహ్మ తిరుపతికి రావడంతో ఫ్యాన్స్ సెల్ఫీస్ తెలుకోవడానికి ప్రయత్నించారు.దీంతో బ్రహ్మానందం..ఒరేయ్ బండి మీ మీదకు వెళ్తుంది రా నాయనా..అంటూ జాగ్రత్త చెప్పారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

హాస్య బ్రహ్మకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తో మన అందరికీ తెలిసిందే. స్వయంగా బ్రహ్మానందం వెంకటేశ్వరా స్వామిని డ్రాయింగ్ చేసి తన ఇంట్లో పొందుపరిచారు. ఇక లేటెస్ట్గా బ్రహ్మీ ఇంట్లో తన చిన్న కుమారుడి వివాహం జరగడంతో..శ్రీవారి ఆశీర్వచనాల కోసం వెళ్లినట్లు సమాచారం.