
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాధారణ రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా సీజన్ విన్నర్ గా నిలిచి కప్పు గెలుచుకున్నాడు. అయితే ఆ ఆనందం రెండు రోజులు కూడా లేకుండా పోయింది అతనికి. బిగ్ బాస్ ఫినాలే రోజు అతని ఫ్యాన్స్ చేసిన హంగామాకు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, తాజాగా ఈ ఇష్యూపై జబర్దస్త్ లో కామెడీ స్కిట్ చేశారు. అది కూడా పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచిన నటుడు శివాజీ. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ #90's మిడిల్ క్లాస్ బయోపిక్. ఇటీవలే టెలికాస్ట్ అయిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇందులో భాగంగా జబర్దస్త్ కు వచ్చారు మూవీ టీమ్. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఆధ్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ఇక ప్రోమోలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడం, ర్యాలీ, పోలీసులు అడ్డు చెప్పడం, అరెస్ట్ లాంటి సన్నివేశాల్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు.
అయితే ఆ స్కిట్ సమయంలో శివాజీ చాలా సీరియస్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ స్కిట్ కు శివాజీ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ విషయం తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.