న్యూఢిల్లీ: ఐడియా ఫోర్జ్ ఐపీఓ ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండనుంది. గురువారం మార్కెట్‌కు సెలవు కావడంతో శుక్రవారం ఐపీఓను ఓపెన్‌లో ఉంచాలని కంపెనీ నిర్ణయించింది. కాగా, బక్రీద్ సందర్భంగా మార్కెట్‌కు గురువారం హాలిడే అని మంగళవారం ఎన్ఎస్ఈ సడెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒరిజినల్‌గా బుధవారం మార్కెట్‌కు సెలవు ఉండాలి. ఐడియా ఫోర్జ్ ఐపీఓకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంపెనీ షేర్లు ఏకంగా 28.28 రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించాయి. రిటైల్ కేటగిరి 55.39 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 46 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కోసం కేటాయించిన షేర్లు 10.18 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి.
కాగా, డ్రోన్ సెగ్మెంట్లో ఐడియా ఫోర్జ్ బిజినెస్ చేస్తోంది. కంపెనీ షేర్లు ఐపీఓలో రూ.638–672 ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూకు వస్తున్న డిమాండ్ చూస్తుంటే కంపెనీ షేర్లు రూ.535–550 ఎక్కువకు మార్కెట్లో లిస్ట్ అవ్వొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూలో ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.240 కోట్లను సేకరిస్తారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 48.6 లక్షల షేర్లను షేర్హోల్డర్లు అమ్మనున్నారు. దీంతో మొత్తంగా రూ.567 కోట్లను ఐడియా ఫోర్జ్ సేకరించనుంది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో రూ.50 కోట్లను అప్పులు తీర్చడానికి, మరో రూ.135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడతామని కంపెనీ ప్రకటించింది.