- తన కొడుకు సాయి కిరణ్ యాదవ్ కు టికెట్ కోసం తలసాని ప్రయత్నాలు
- తలసాని కొడుకుకు ఇవ్వొద్దంటున్న స్థానిక నేతలు
- రేసులో దాసోజు శ్రవణ్, పీజేఆర్ కొడుకు, లోకల్ లీడర్
- సీటు కోసం మన్నె గోవర్ధన్, మన్నె కవిత ప్రయత్నాలు
- ఎవరికి ఇస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇంకా ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రానే లేదు.. ఇప్పటి నుంచే పలువురు ఆశావహులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. స్థానికత, అనుభవం, డబ్బు వంటి వాటిపై బీఆర్ఎస్వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అయితే, ప్రస్తుతం ఖైరతాబాద్టికెట్ఎవరికిస్తరన్న దానిపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కొడుకు సాయికిరణ్‌యాదవ్‌కు టికెట్దాదాపు ఖరారైపోయిందన్న పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది.
దీనిపైనే కొందరు నేతలు స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఖైరతాబాద్టికెట్రేసులో ఉన్న నేతలూ అసంతృప్తిలోనే ఉన్నట్టు చర్చించుకుంటున్నాయి. సాయికిరణ్యాదవ్గత ఎన్నికల్లో సికింద్రాబాద్పార్లమెంట్స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్తరఫున ఖైరతాబాద్ఎమ్మెల్యేగా గెలవడం.. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లడం.. అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రయత్నాలు షురూ..
ఖైరతాబాద్ఉప ఎన్నిక అనివార్యమని తేలినప్పటి నుంచి పలువురు స్థానిక నేతలు.. ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న దాసోజు శ్రవణ్కూడా అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జిగా ఇప్పటికే ఆయన యాక్టివ్‌గా ఉన్నారు. ఇటు పీజేఆర్తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.
ఆయనతో పాటు మన్నె గోవర్ధన్‌రెడ్డి కూడా టికెట్ఆశిస్తున్నారు. తనకు కాదనుకుంటే ఆయన భార్య, మాజీ కార్పొరేటర్ కవితకైనా టికెట్ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లతోపాటు ఖైరతాబాద్‌లో మరో సీనియర్‌నేత మహేశ్‌యాదవ్ కూడా ప్రయత్నాలు
జోరుగానే చేస్తున్నారు.
లోకల్ వాళ్లకే ఇవ్వాలన్న డిమాండ్లు.
సాయికిరణ్యాదవ్పేరు తెరపైకి రావడంతో స్థానిక నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. వేరే నియోజకవర్గం నేతను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడమేంటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అవసరమైతే సనత్‌నగర్ టికెట్ ఇప్పించుకోవాలన్న డిమాండ్లను పెద్దల ముందు పెడుతున్నట్టుగా చర్చ నడుస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఎక్కువ భాగం డివిజన్లలోని నేతలంతా సాయికిరణ్‌ను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మరి, గులాబీ బాస్టికెట్ఎవరికిస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది.
