నవ్వుల పండుగలా ‘కామ్రేడ్ కళ్యాణ్’.. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శ్రీవిష్ణు  

నవ్వుల పండుగలా ‘కామ్రేడ్ కళ్యాణ్’.. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శ్రీవిష్ణు  

శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల రూపొందించిన   చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌’.  కోన వెంకట్ సమర్పణలో   వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేసిన టీమ్.. శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.  ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఇది కొత్త జానర్‌‌‌‌‌‌‌‌లో చేసిన మాస్ కామెడీ సినిమా.  ప్రేక్షకులు సినిమాను నవ్వుల పండుగలా ఆస్వాదిస్తుండటం ఆనందంగా ఉంది.

 కుటుంబ సభ్యులంతా కలిసి ఎంజాయ్ చేసే పక్కా దసరా సినిమా ఇది’ అని అన్నాడు. ప్రేక్షకులు సినిమాను పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఆదరిస్తున్నారని, తన సక్సెస్ సెంటిమెంట్ మరోసారి నిజమైందని ప్రెజెంటర్ కోన వెంకట్ అన్నారు. సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల దర్శకుడు జానకిరామ్ సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికా నుంచి గుంటూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం వరకు సినిమాకు మంచి స్పందన  వస్తోందని నిర్మాత వెంకట కృష్ణ  అన్నారు.