శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. , వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఫస్ట్ సింగిల్‌గా ‘ఒరియా పిల్లా’ అనే పాటను జూన్ 20న రిలీజ్ చేయనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, మహిమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
