SRH Players Dispute: ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌కి స్పిన్నర్ జీసన్ అన్సారీ మధ్య గొడవ జరినట్లు ఒక వీడియో నెట్టింట ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. లెగ్ స్పిన్నర్ జీసన్ అన్సారి బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ మొదటి 4 బంతుల్లోనే 2 సిక్సులు, 2 ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ ఆ తర్వాతి ఫుల్ లెంగ్త్ డెలివరీలో కిషన్ డీప్ స్క్వేర్ లెగ్ దగ్గర ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కాగా వికెట్ తీసుకున్న వెంటనే అన్సారి కోపంగా సెలబ్రేట్ చేస్తూ, కిషన్‌ను పెవిలియన్ వైపు వెళ్లమని చేతితో చూపిస్తూ సెండ్-ఆఫ్ పలికాడు. కానీ ఇషాన్ మాత్రం అతడి ప్రవర్తనను చూసి నవ్వుతూ బయటకు వెళ్లిపోయాడు.
కాగా ఇదే ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాట్‌తో సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని దద్దరిల్లించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులతో చెలరేగిన అభి, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 రన్స్ కే ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా కేవలం 25 బంతుల్లోనే 72 రన్స్ చేశాడు. అయితే, టీ20 వరల్డ్‌కప్ జోష్‌లో ఉన్న ఈ ఇద్దరూ ఐపీఎల్ 2026లోనూ వీర విహారం చేస్తారని ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సన్‌రైజర్స్ జట్టులో కెప్టెన్సీ మార్పులు కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో, కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎస్ఆర్హెచ్ ప్రకటించారు. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మను టీమ్ మేనేజ్‌మెంట్ నియమించింది. కిషన్ ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో 317 పరుగులతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-–2లోకి దూసుకెళ్లాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకి టైటిల్ అందించాడు.
Send off to Ishan Kishan 🤯
— Stubbsy (@spideypant_) March 21, 2026
During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.
The team atmosphere doesn’t seem to be very good.
pic.twitter.com/3b75QtTh3F
