మంత్రి వివేక్ పేరుతో పచ్చబొట్టు.. అభిమానం చాటుకున్న కార్యకర్త

మంత్రి వివేక్ పేరుతో పచ్చబొట్టు.. అభిమానం చాటుకున్న కార్యకర్త
  • అభిమానం చాటుకున్న కార్యకర్త

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేరుతో చేతిపై పచ్చబొట్టు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్త అభిమానం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం బొక్కలగూడెంకు చెందిన కొంపెల్లి బానేశ్ అనే కార్యకర్త మంత్రి వివేక్ పేరుతో పచ్చబొట్టు వేసుకున్నారు. 

పదవిలో ఉన్నా లేకున్న పేదల ప్రజల కోసం మంత్రి చేస్తున్న సేవలకు ఆకర్షితుడినై పచ్చబొట్టు వేసుకున్నానని బానేశ్ తెలిపారు. వివేక్ వెంకటస్వామిపై ఉన్న అపారమైన అభిమానంతో చాలా ఏండ్లుగా ఆయన వెంటే నడుస్తున్నానని చెప్పారు.