SIRతో ఎన్నికలలో అక్రమాలు చేసి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణ

SIRతో ఎన్నికలలో అక్రమాలు చేసి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రక్రయతో అక్రమాలకు పాల్పడి బీజేపీ అధికారింలోకి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.సీఈసీ జ్ణానేష్ కుమార్, రూల్స్ అతిక్రమించి బీజేపీ ఫేవర్ చేయడం వల్లే మహారాష్ట్రలో మహాయుతి ఆధ్వర్యంలో బీజేపీ అధికారం పొందిందని విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల ముందు ఓటర్ల లిస్టులో భారీ ఎత్తున మార్పులు చేశారని,  సర్ ప్రక్రియలో భాగంగా 40ఓట్లను కొత్త చేర్చి అధికారంలోకి వచ్చేలా అక్రమాలకు పాల్పడ్డారని  మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీపీ జోషి, వర్షా గౌక్వాడ్ ఆరోపించారు. 

 రూల్స్ అతిక్రమించి ఫారం 6,7,8 లలో మార్పులు చేశారని అన్నారు. ఎన్నికల నమోదు అధికారుల అధికారాలను లాగేసుకుని వాటిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్ సీమీ ఖాన్నాకు అప్పగించారని ఆరోపించారు. బీహార్‌లో ఓటర్ల లిస్టునుంచి  దాదాపు 47 లక్షల పేర్లను, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షలకు పైగా పేర్లను తొలగించారని, మహారాష్ట్రలో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయని ఆరోపించారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నుంచి ఆరు నెలల వ్యవధిలో మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు 40 లక్షల మందిని చేర్చారని గైక్వాడ్ అన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో సుమారు 400 మంది ఓటర్లను అదనంగా చేర్చారని, SIR ప్రక్రియ కింద ముంబైలో లక్షలాది మంది ఓటర్లను ఇప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు.