కేరళ కాంగ్రెస్ కు చెందిన నేత చెరియన్ ఫిలిప్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. మహిళ అని కూడా చూడకుండా కొల్లామ్ ఎమ్మెల్యే పట్ల ఆయన ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం. శాసనసభ పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేపీసీసీ హెడ్డాఫీసుకు వచ్చారు ఎమ్మెల్యే బిందు కృష్ణ. ఈ క్రమంలో అభివాదం చేస్తూ ఆఫీసు ప్రాంగణంలోకి వస్తున్న బిందు కృష్ణను కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు చెరియన్ ఫిలిప్. ఆమె వద్దని వారిస్తున్నా చెరియన్ వాటేసుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెరియన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. రాజకీయ నాయకుడు అయ్యుండి పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా అంటూ కామెంట్ చేస్తున్నారు పలువురు నెటిజన్స్.
A video from the Kerala Pradesh Congress Committee headquarters in Thiruvananthapuram has gone viral after Cherian Philip allegedly attempted to hug newly elected Kollam MLA Adv. Bindu Krishna despite her apparent reluctance during a legislative party meeting.
— Hate Detector 🔍 (@HateDetectors) May 7, 2026
The viral video… pic.twitter.com/UhURpa80Qz
వీడియోలో చెరియన్ ఫిలిప్ మళ్ళీ ఆమె దగ్గర నిలబడి ఉండగా, బిందు కృష్ణ దూరం పాటిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ.. ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలో ఈ సంఘటన జరగడంతో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా బహిరంగ, అధికారిక ప్రదేశాలలో పర్సనల్ లిమిట్స్ ను గౌరవించాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. పార్టీ ఆఫీసులు కూడా మహిళలకు ఇబ్బంది కల్గించేలా మారకూడదని అంటున్నారు నెటిజన్స్.
