కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి

కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారంలోని లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎంగా ఉన్న రేవంత్ గేమ్ ఆడకుండా ఉంటారా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ ఏ ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నాడో తెలియదు కానీ.. ఆయన వ్యూహాలను తిప్పి కొట్టే స్కెచ్ మా దగ్గర ఉన్నది’’అని తెలిపారు. శుక్రవారం గాంధీభవన్​లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్​లోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారనేది ఎన్నికల తర్వాత తెలుస్తది. బీజేపీ నేతలంతా గ్రాఫిక్స్ లీడర్లు. పెద్ద దేశభక్తులమంటూ బీజేపీ లీడర్లు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ వాళ్లంతా డూప్లికేట్ దేశభక్తులు’’ అని అన్నారు.