మలి విడత తెలంగాణ ఉద్యమానికి కాకా స్ఫూర్తి

మలి విడత తెలంగాణ ఉద్యమానికి కాకా స్ఫూర్తి

మలి విడత తెలంగాణ ఉద్యమానికి కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి స్ఫూర్తి అన్నారు కాంగ్రెస్ నేతలు. కాకా 91వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జానారెడ్డి, శంకర్ రావు, గీతారెడ్డి పూలమాలలు వేసి… నివాళులర్పించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా కాకా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు కాంగ్రెస్ నేతలు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కాకా గాయపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోను తెలంగాణ కోసం ఆయన పోరాడారని తెలిపారు.

అప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్

డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

భారత్ లో 66 లక్షలు దాటిన కేసులు

తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు