
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రిగా ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి, ధర్మారానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వివేక్ కుటుంబ అభిమానులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్‌ను కలిసి శాలువాలు, బొకేలతో సన్మానించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ, తాళ్లపల్లి లింగయ్య గౌడ్, బొమ్మగాని సతీశ్‌గౌడ్, దేవి కిశోర్, సయ్యద్ సజ్జాద్, ఉనుకొండ శ్రీధర్పటేల్, బండారి సునీల్, గంగుల సంతోష్ పాల్గొన్నారు.