బాల్కసుమన్ ఇసుక దందాతో వెయ్యికోట్లు సంపాదించిండు: వివేక్ వెంకటస్వామి

బాల్కసుమన్ ఇసుక దందాతో వెయ్యికోట్లు సంపాదించిండు: వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. మందమర్రి మండలం పులిమడుగులో ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులతో మాట్లాడారు. మందమర్రి మండలం మార్కెట్ ఏరియా CSI చర్చిలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. 

మందమర్రి మండలంలో పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదన్నారు వివేక్. బాల్క సుమన్ ను తరిమికొట్టాలంటే హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. బాల్కసుమన్ కు ప్రజల సమస్యలను పట్టించుకునే సమయం లేదన్నారు. ఆయనకు ఏ పనిపైనా సోయి లేదని విమర్శించారు.  చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా చేసి వెయ్యికోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకున్న బాల్క సుమన్ ను ఎన్నికల్లో ఓడించాలన్నారు.