బండ్లన్నా.. నువ్వు తోపన్నా.. ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

బండ్లన్నా.. నువ్వు తోపన్నా.. ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఏది చేసినా సంచలనమే. అది సినిమా అయినా, రాజకీయమైనా.. ఆయన మాట్లాడే మాటలు, చేసే కామెంట్స్ దెబ్బకి ట్రేండింగ్ లోకి రావాల్సిందే. అది సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్. అయితే ఆదారిలో కొన్ని సార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు బండ్ల గణేష్. 

ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు బండ్ల గణేష్. కారణం తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే. ఎన్నికలో నేపధ్యంలో జరిగిన ప్రచారంలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ వాళ్లకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా ఏకమై అధికార పార్టీ గద్దె దింపే ప్రయత్నాలు మొదలు పెట్టారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. 

అంతేకాదు.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని కార్యకర్తల్లో ఆత్మవిహాస్వాన్ని నింపారు. ఇప్పుడు బండ్ల గణేష్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ విజయం సాధించడంతో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. బండ్లన్నా.. నువ్వు తోపన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.