కుక్కను తప్పించబోయి కిందపడ్డ కానిస్టేబుల్ మృతి

కుక్కను తప్పించబోయి కిందపడ్డ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ లో రాజు అనే కానిస్టేబుల్ ఇవాళ(సోమవారం) చనిపోయాడు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రాజు రెండు రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో…చాదర్ ఘాట్ బ్రిడ్జి దగ్గర రోడ్డుపై కుక్కలను తప్పించబోయి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారు జామున చనిపోయాడు.

రాజు 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి.