ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగినులకు లైంగిక వేధింపులు

ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగినులకు లైంగిక వేధింపులు

తన కింద పని చేస్తున్న ఉద్యోగులను, నూతనంగా ఉద్యోగ అవకాశం కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ఎజిల్ కాంట్రాక్టు ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దారం సుజాత అనే మహిళ గత కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఓరియన్ ట్రాలి సర్వీసులో విధులు నిర్వహిస్తున్నది. అక్కడ పని భారం ఎక్కువగా ఉండడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ కి చెందిన ఎజిల్ కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉద్యోగం కావాలని ఆమె ఏజిల్ కాంట్రాక్ట్ అడ్మిన్ శ్రీకాంత్ ను సంప్రదించింది. ఏజిల్ కంపెనీ లో ఉద్యోగం కావాలంటే తన రూమ్ కి రావాలని శ్రీకాంత్ బాధిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చాడ‌ని, బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు మహిళలను కూడా శ్రీకాంత్ ఇలాగే లైంగికంగా ఉద్దేశంతో వేధించాడని బాధితులు త‌మ‌కు తెలిపార‌న్నారు సి ఐ విజయ్ కుమార్. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.