అయ్యో ఊర్వశి.. నీ చేతిలో నా చేయి అతుక్కుపోయింది

అయ్యో ఊర్వశి.. నీ చేతిలో నా చేయి అతుక్కుపోయింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సమావేశమైంది. మాస్ మసాలా అండ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న  ఈ సినిమాలో  టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుండడం విశేషం. అయితే ఈ మీట్ లో చిరంజీవి చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకుంది. చిరంజీవి, రవితేజ, రాజేంద్రప్రసాద్, దర్శకుడు బాబీ, దేవిశ్రీప్రసాద్, ఊర్వశి రౌతేలా, ఫైట్ అండ్ డాన్స్ మాస్టర్స్, నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ అంతా ఒకే వేదికపై ఉండగా.. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా గురించి కూడా మాట్లాడుతూ చిరు చేసిన పని అందర్నీ నవ్వించింది.

“బాస్ పార్టీ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఆ సాంగ్ కి ఎవర్ని పెడతారో ఏంటో అని అనుకున్నప్పుడు ఊర్వశి అన్నారు. ఇక ఊర్వశి కనబడగానే మాటలు రాలేదు నాకు అని చిరు అన్నారు. ఈ సమయంలో లేచి నిలబడి, తన దగ్గరకు వచ్చిన ఊర్వళి మెగాస్టార్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే చిరు ఆ చెయ్యి వెనక్కి తీసుకునేటప్పుడు.. అతుక్కుపోయింది, ఆమె చేతి నుండి రావడం లేదు అంటూ నవ్వులు పూయించారు. అయస్కాంతం చేతికే పెట్టుకుంది అయస్కాంతం.. మనసుకు పెట్టుకోలేదు అని అందర్నీ అలరించారు.