హైదరాబాద్, వెలుగు: బెంగళూరుకు చెందిన ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బ్రాండ్ కాస్మోస్ హైదరాబాద్‌లో స్టోర్‌ను ప్రారంభించింది. పారదర్శక విధానం, ఆకర్షణీయ డిజైన్లతో అద్భుత అనుభూతిని అందిస్తామని ఫౌండర్ సంజన త్రిపురమల్లు తెలిపారు.
డైమండ్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చామని పేర్కొన్నారు. రోజువారీ అవసరాలు మొదలుకొని ప్రత్యేక వేడుకల వరకు సరిపోయే విభిన్న రకాల ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని పేర్కొన్నారు. వంద శాతం బైబ్యాక్, ఎక్స్ఛేంజ్ పాలసీని అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు తమ సేవలను విస్తరిస్తామని ఆమె వెల్లడించారు.
