కౌన్సెలింగ్ :  దంపతులు ఇలా ఉంటే..జీవితాంతం హ్యాపీగా ఉంటారు..

కౌన్సెలింగ్ :  దంపతులు ఇలా ఉంటే..జీవితాంతం హ్యాపీగా ఉంటారు..

విడాకులు. ..ఈ పదం వింటే చాలామందిలో ఒకలాంటి భయం, విచారం, కోపం, నిస్సహాయతలు కలుగుతాయి. అయితే ఇంతకు పూర్వంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఇది సర్వసాధారణం అయిపోయింది.  మన సమాజంలో అయితే విదేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల రేటు చాలా తక్కువ. కానీ.... మొత్తంగా చూసుకుంటే ఈ విడాకుల రేటు స్థిరంగా పెరుగుతుందనే చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ కారణం వల్లనే వీటి సంఖ్య పెరుగుతోందని చెప్పడం కష్టం. కుటుంబ వ్యవస్థలోనే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఒక్క మనదేశంలోని పరిస్థితే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలానే ఉంది. కాని బార్యభర్తల బంధం  భారం కాకుండా జీవితాంత కాలం సుఖంగా ఉండాలంటే  ఎలా ఉండాలో తెలుసుకుందాం..! 

వివాహం అనేది వధూవరుల కుటుంబాలకే పరిమితం కాకుండా సమాజంతో ముడిపడి ఉంటుంది. మెటీరియలిస్టిక్ ఆలోచనలు కుటుంబాలను, దంపతులను ఆర్థిక పరమైన విజయం వైపే అడుగులు వేయిస్తున్నాయే తప్ప ఆరోగ్యకరమైన బంధాల గురించి ఆలోచించేలా చేయడం లేదు. అంతేకాకుండా ఇప్పటి అవసరాలు, లక్ష్యాలు మారిపోయాయి. వాటిని చేరుకోవాలనే పరుగులో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఒత్తిడి బంధాలకు గండి కొడుతోంది.

బీటలు వారుతోంది ఇలా...

  • తమ గురించే ఆలోచించడం. లేదా అహంకారంగా ఉండడం.
  • సరి తూగని వ్యక్తులతో, ప్రదేశాల్లో పోటీ ధోరణితో ఉండడం. చుట్టుపక్కల వాళ్లతో, స్నేహితులతో, కొన్నిసార్లు జీవితభాగస్వామితో కూడా. పోల్చుకోవడం... ఆ పోలిక అనేది కెరీర్ లేదా ఆర్థిక ఎదుగుదలల్లో కావొచ్చు.
  • జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం, దురహంకార ధోరణి కలిగి ఉండడం..
  • కోపం, హింసాత్మక ప్రవర్తన.
  • ఎదుటి వ్యక్తులను తక్కువ చేస్తూ మాట్లాడడం... ఇతరుల భావాలను అర్థం చేసుకోకుండా, వాళ్ల అవసరాలను గుర్తించకుండా ప్రవర్తించడం.
  • ఎప్పుడూ అది కావాలి... ఇది కావాలి అనుకోవడం.. ఏదీ సహించలేకపోవడం... ఓపిక అనేది లేకపోవడం.
  •  భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే అంశాలకు కూడా ఇరు కుటుంబాలను భాగం చేయడం.
  • ఎదుటి వ్యక్తిని ఏ విధంగానూ మెచ్చుకోకపోవడం..జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండకపోవడం..

ఇలా సర్దుకుపోండి

  •  భార్యాభర్తలు ఇప్పుడున్న జీవన పరిస్థితు లకు తగ్గట్టు ఉండాలే కాని ఎప్పటివో సంప్రదాయాలను ఆచరించాలనుకుంటే కుదరదు. అందుకనే భార్యాభర్తల్లో ఎవరూ తమ గురించి స్వార్థంగా ఆలో చించకుండా అహంకార పూరితంగా ఉండకపోతే సగం యుద్ధం గెలిచినట్టే మగవాళ్లు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో బాధ్యత పంచుకోవచ్చు.
  • ఎక్కువ బంధాల్లో బీటలు ఎందుకు వస్తాయంటే భార్యాభర్తల్లో ఒకరు స్వార్థంగా ఆలోచించడం వల్లనే. దంపతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇద్దరూ కూడా యజమానులుగా ఉంటూ... బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పుడే ఆ బందం సక్సెస్​ఫుల్ గా ఉంటుంది.
  • సాధారణంగా అవతలి వ్యక్తిని తప్పుపట్టే తత్వం ఉంటుంది చాలామందికి. ఒక బంధం ఆరోగ్యంగా కొనసాగాలన్నా, వృద్ధి చెందాలన్న ఇద్దరి మధ్యా సమగ్రత, సమాచార వ్యక్తీకరణ బాగుండాలి. కుటుంబాలు ప్రశాంతంగా ఉండేందుకు చురుకైన పాత్ర పోషించాలే కానీ ప్రశాంతత పోగొట్టుకుని ఇబ్బంది పడేలా కాదు.