బాసర ఆలయ .. ఆదాయం రూ. 67లక్షలు

బాసర ఆలయ .. ఆదాయం రూ. 67లక్షలు

బాసర, వెలుగు: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం హుండీ కానుకలను గురువారం అధికారులు లెక్కించారు. అమ్మవారికి రూ.67 లక్షల 8 వేల నగదు సమకూరినట్లు ఈవో విజయ రామారావు వెల్లడించారు. మిశ్రమ బంగారం 0.75 గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 600 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 27 వచ్చాయని తెలిపారు.

 ఇది 44 రోజులకు సంబంధించిన ఆదాయమన్నారు. లెక్కింపుల్లో ఆలయ ఆఫీసర్లు, పోలీసులు, బ్యాంకు సిబ్బందిపాల్గొన్నారు.