వీడి పని బాగుంది : కూల్ వెదర్.. బైక్ పై లవర్.. ఆపై రొమాన్స్ సీటింగ్

వీడి పని బాగుంది : కూల్ వెదర్.. బైక్ పై లవర్.. ఆపై రొమాన్స్ సీటింగ్

లవర్స్  రోజు రోజుకు బరితెగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో పాడుపని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బైక్స్పై  ప్రమాదకరంగా వెళ్తూ రొమాన్స్లో మునిగిపోతున్నారు. చిత్రవిచిత్రమైన భంగిమల్లో ముద్దుల్లో మునిగితేలుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువ జంట బైక్పై రొమాన్స్తో రెచ్చిపోయింది. రోడ్డుపై యువకుడు బైక్ను డేంజరస్ గా నడుపుతుంటే..యువతి అతన్ని ముద్దుల్లో మంచెత్తుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

 

జూలై 16 ఆదివారం  ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై  ఓ ప్రేమ జంట పబ్లిక్ గా రొమాన్స్  చేసింది. బైక్ ట్యాంక్‌పై కూర్చున్న అమ్మాయి.. రైడింగ్ చేస్తున్న అబ్బాయిని గాఢంగా కౌగిలించుకుంది. బైకు నిదానంగా వెళుతుందా అదీ లేదు.  ప్రియుడు అమిత వేగంతో దూసుకెళ్లాడు. ఆ జోష్లో యువతి యువకుడిని గట్టిగా హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించింది.   వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వైరల్ అయింది. 

ఈ ఘటనపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడిన వారి  స‌మాచారాన్ని  ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు సెంటిన‌ల్ యాప్‌కు  రిపోర్ట్ చేయాల‌ని సూచించారు. అటు ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చీచీ పబ్లిక్ గా ఇదేం పాడుపని అని మండిపడ్డారు. మరో యూజర్ అయితే అమ్మాయి హెల్మెట్ పెట్టుకోలేద‌ని, వారిని అరెస్టు చేయాల‌ని  డిమాండ్ చేశారు.