కేసీఆర్‌‌‌‌ను బీజేపీ కాపాడాలని చూస్తోంది : నారాయణ

కేసీఆర్‌‌‌‌ను బీజేపీ కాపాడాలని చూస్తోంది : నారాయణ
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌తో సయోధ్య వల్లే కవిత అరెస్ట్ కాలే

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో జరి గిన అవినీతి నుంచి కేసీఆర్‌‌‌‌ను బీజేపీ కాపాడాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీజేపీ, సీబీఐ ఒక్కటేనని అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీకి ఆ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

వంద కోట్ల అవినీతి ఆ రోపణలున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను జైల్లో వేసిన మోదీ.. లిక్కర్ స్కామ్‌‌ ఆధ్యులైన వైసీపీ, బీఆర్ఎస్ లీడర్లను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, -బీజేపీ సయోధ్య వల్లే లిక్కర్ స్కామ్‌‌లో కవిత అరెస్టు కాలేదని ఆరోపించారు.