CPM: సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా

 CPM: సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా

సీపీఎంకు గట్టి షాక్ తగిలింది. సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతో రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆయన రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు రాఘవులును బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.