దసరా వచ్చింది.. ‘ఎలివేటెడ్ కారిడార్’ ఏమైంది? : సీపీఎం జిల్లా కార్యదర్శి మేడిపల్లి సత్యం

దసరా వచ్చింది.. ‘ఎలివేటెడ్ కారిడార్’ ఏమైంది? : సీపీఎం జిల్లా కార్యదర్శి మేడిపల్లి సత్యం
  • పనులు పూర్తి చేయకపోవడంపై నిరసన  

ఉప్పల్‌‌, వెలుగు : ఉప్పల్‌‌–నారపల్లి ఎలివేటెడ్‌‌ కారిడార్‌‌ నిర్మాణ పనులను దసరా నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హామీ ఇచ్చారని, దాని సంగతేందని మేడ్చల్‌‌జిల్లా సీపీఎం కార్యదర్శి మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. 

పనులు పూర్తి చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉప్పల్‌‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దసరా నాటికి పూర్తి చేస్తామన్న గతంలో ప్రకటించిన మంత్రి తాజాగా శాసనసభలో వచ్చే ఏడాది జూన్‌‌నాటికి పూర్తి చేస్తామని చెప్పడం ఏమిటన్నారు. పనులు కొనసాగుతున్న వేగాన్ని చూస్తే జూన్‌‌నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు.