సస్పెండైన కానిస్టేబుల్ ..టిక్ టాక్ తో సెలబ్రిటీ స్టార్

సస్పెండైన కానిస్టేబుల్ ..టిక్ టాక్ తో సెలబ్రిటీ స్టార్
  •     టిక్​టాక్​తో అల్పితకు పెరిగిన క్రేజ్‌‌
  •     సినిమాల్లో నటించాలని ఆఫర్లు

ఏడాది కింద టిక్‌‌టాక్‌‌ చేస్తూ సస్పెండైన ఓ లేడీ కానిస్టేబుల్‌‌.. ఇప్పుడు సెలెబ్రిటీ అయింది. సస్పెండైన తర్వాత చేసిన  వీడియో ఆల్బమ్‌‌లతో గుజరాత్‌‌లో స్టారైపోయింది. గుజరాతీ సినిమాల్లో నటించమని ఆఫర్లు కూడా వస్తున్నాయి. గుజరాత్‌‌లోని మెహ్‌‌సన జిల్లా లంఘ్నాజ్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో అల్పిత చౌదరి కానిస్టేబుల్‌‌. గతేడాది ఆమె స్టేషన్‌‌లో చేసిన టిక్‌‌టాక్‌‌ వీడియో బాగా వైరలైంది. విషయం అధికారులకు తెలిసి ఆమెను సస్పెండ్‌‌ చేశారు. సస్పెండ్‌‌ అయిన తర్వాత  గుజరాత్‌‌ ఫోక్‌‌ సింగర్‌‌ జిగ్నేష్‌‌ కవిరాజ్‌‌తో కలిసి గత సెప్టెంబర్‌‌లో ‘టిక్‌‌టాక్‌‌నే దీవానీ’ పేరుతో ఓ వీడియో ఆల్బమ్‌‌ విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాతీ యాక్టర్‌‌ ధవల్‌‌ బరోత్‌‌తో కలిసి ఆమె చేసిన ‘కచ్చీ కేరీ, పకి కేరీ’ ఆల్బమ్‌‌ కూడా సక్సెసయింది. సస్పెండైనప్పటి నుంచి ఇప్పటివరకు 4 వీడియో ఆల్బమ్‌‌లలో అల్పిత కనిపించింది. దీంతో ఆమె క్రేజ్‌‌ పెరిగి గుజరాతీ సినిమాల్లో నటించాలని ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. తనకూ నటించాలని ఉందని, కానీ పై అధికారుల నుంచి పర్మిషన్‌‌ కోసం వెయిట్‌‌ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం మెహ్‌‌సనా జిల్లాలోని కడి పోలీస్‌‌ స్టేషన్‌‌లో అల్పిత పని చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌‌, బందోబస్త్‌‌కు వెళ్లినప్పుడు జనం సెల్ఫీ కోసం గుమిగూడతారని అల్పిత చెబుతున్నారు. ‘యాక్టర్‌‌, మోడల్‌‌, సింగర్‌‌ కావాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. కానీ మా నాన్న పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో పని చేస్తారు. నన్ను ఓ పోలీస్‌‌లా చూడాలనుకున్నారు. ఆయన కోసం పోలీసయ్యా. కానీ ఓ డ్రీమ్‌‌ కోసం ఇంకో డ్రీమ్‌‌ను వదులుకోవద్దని అనిపించింది’ అని అన్నారు.