మరోసారి పూరీ, మణిశర్మ కాంబినేషన్ రిపీట్

మరోసారి పూరీ, మణిశర్మ కాంబినేషన్  రిపీట్

దర్శకుడు పూరీ జగన్నాధ్, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్ అనగానే  పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ సినిమాల చార్ట్ బస్టర్ ఆడియో గుర్తొస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రామ్‌‌తో పూరి జగన్నాథ్ తీస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్‌‌’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ పై ఫోటోను విడుదల చేశారు. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.