
కరీనా కపూర్ ఖాన్, కృతిసనన్, టబు లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘క్రూ’. రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియాకపూర్ నిర్మిస్తున్నారు. మార్చి 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. శుక్రవారం టబు, కరీనా, కృతి పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్ గెటప్‌లో కనిపిస్తున్నారు. టబుకు ప్రమాదం అని, కరీనాను దొంగ అని, కృతి సనన్‌ను నకిలీ అని పోస్టర్స్‌కు క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పంజాబీ నటుడు దిల్జీజ్ దోసాంజ్, కపిల్ శర్మ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.