బంజారాహిల్స్లో రెండు వైన్ షాప్లపై క్రిమినల్ కేసులు..

బంజారాహిల్స్లో రెండు వైన్ షాప్లపై క్రిమినల్ కేసులు..

హైదరాబాద్: నగరంలో రూల్స్ విరుద్ధంగా నడుపుతున్న వైన్ షాప్ లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జనవరి 11వ తేదీ గురువారం బంజారాహిల్స్లోని రెండు వైన్ షాప్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పర్మిట్ రూమ్ లలో ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతుండడంతో  కేసులు నమోదుచేసినట్లు తెలుస్తోంది. 

బంజారాహిల్స్  రోడ్ నెంబర్ 12లో ఉన్న  కాలభైరవ వైన్స్ తోపాటు.. రోడ్ నెంబర్ 10లో ఉన్న గౌరీ శంకర్ వైన్స్ పై ఐపీసీ సెక్షన్ 269, 36(1)(b)(c)ల కింద  పోలీసులు కేసులు నమోదు చేశారు.  గతంలో ఎప్పుడూ ఇలాంటి కేసులు తమపై నమోదు కాలేదంటూ వైన్ షాప్ ల నిర్వాహకులు వాపోతున్నారు.