టూల్స్ & గాడ్జెట్స్: కార్ల సెక్యూరిటీ కోసం క్యూబా డ్యాష్ క్యామ్ ప్రో ఎక్స్...

టూల్స్ & గాడ్జెట్స్: కార్ల సెక్యూరిటీ కోసం క్యూబా డ్యాష్ క్యామ్ ప్రో ఎక్స్...

క్యూబో డ్యాష్‌క్యామ్ ప్రో ఎక్స్ కార్ల కోసం రూపొందించిన స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా. రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ వివరాలు రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 2కే రిజల్యూషన్‌తో వచ్చే ఈ కెమెరా నంబర్ ప్లేట్లు, రోడ్డు బోర్డులను స్పష్టంగా రికార్డ్ చేస్తుంది. 360 డిగ్రీలు తిరిగే డిజైన్ ఉండటంతో కారు లోపలి భాగాన్ని కూడా రికార్డ్ చేయొచ్చు. నైట్ విజన్ టెక్నాలజీ వల్ల రాత్రి సమయంలో కూడా  వీడియో క్వాలిటీ బాగా వస్తుంది. 

సాధారణ బ్యాటరీకి బదులుగా సూపర్ కెపాసిటర్ ఉండటంతో అధిక వేడిలో కూడా మన్నికగా పనిచేస్తుంది. వై-ఫై, మైక్రోఫోన్ ఉండటంతో మొబైల్ యాప్ ద్వారా వీడియోలను నేరుగా చూడొచ్చు. 1TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ ఉండటం వల్ల ఎక్కువ వీడియోలను స్టోర్​ చేసుకోవచ్చు. 

మన దేశంలోని రోడ్లు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డ్యాష్‌క్యామ్ డ్రైవర్లకు అదనపు భద్రతను అందిస్తుంది.