దబంగ్ 3: ప్రభుదేవా డైరెక్షన్… సల్మాన్ యాక్షన్

దబంగ్ 3: ప్రభుదేవా డైరెక్షన్… సల్మాన్ యాక్షన్

చుల్‌ బుల్‌ పాండే.. ఈ పేరు వినగానే సల్మాన్ ఖాన్ కళ్లముందు కదులుతాడు. ‘దబంగ్’ సినిమాలోని ఆ పాత్రను అంత అద్భు తంగా పోషించాడు మరి. అంతవరకూ సల్మాన్ చేసిన పాత్రలన్నీ ఒకెత్తయితే.. చుల్‌బుల్ పాండే క్యారెక్టర్ మరొక ఎత్తు. సీరియస్ గా ఉంటూనే కామెడీని ప్రదర్శించే రోల్. దాన్ని ఎంతో ఈజ్ తో చేసి పారేశాడు సల్మాన్. పోలీస్ అంటే ఇలాక్కూడా ఉంటాడా అనుకునేలా చేశాడు. దాంతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. దాంతో సీక్వెల్ కూడా తీశాడు. మరో సక్సెస్ ను అందుకున్నాడు. అందుకే అక్కడితో ఆగకుండా మూడో పార్టుకి కూడా
శ్రీకారం చుట్టాడు. ప్రభుదేవా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ‘దబంగ్‌‌‌‌‌‌‌‌ 3’ని డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20న రిలీజ్ చేసేందుకు ముహూర్తం పెట్టారు. అయితే ఈసారి కేవలం హిందీలోనే కాదు… తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీని విడుదల చేయనున్నారు.

‘దబంగ్’ మొదటి రెండు భాగాలనూ తెలుగులో పవన్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌తో గబ్బర్ సింగ్‌‌‌‌‌‌‌‌, సర్దార్ గబ్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌గా రీమేక్ చేశారు. మొదటిది విజయం సాధించినా రెండోది మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. కానీ ఈసారి ఎవ్వరికీ చాన్స్ ఇవ్వకుండా సల్మాన్‌ నేరుగా రావడానికి రెడీ అయిపోతున్నారు. మరి బాలీవుడ్‌ వారి మనసులు దోచిన పాండేగారు తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తారో లేదో.