లగ్జరీ బంగ్లా కొన్న దబాంగ్ బ్యూటీ.. ధర ఎంతంటే?

లగ్జరీ బంగ్లా కొన్న దబాంగ్ బ్యూటీ.. ధర ఎంతంటే?

దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఇటీవల దాహద్(Dahaad)​ అనే వెబ్​ సిరీస్​లో నటించింది. తొలి సిరీస్​లోనే అంజలి అనే కాప్​ పాత్రలో అదరగొట్టింది. ఇప్పుడు వరుస చాన్స్​లు అందుకుంటోంది. సినిమాలు లేక కొంతకాలం తెరమరుగైన ఈ బ్యూటీని ఓటీటీలే ఆదుకున్నాయని చెప్పొచ్చు. 

ఇటీవల ముంబైలో బీచ్​ పక్కన ఓ బంగ్లా కూడా కొనేసిందట.దీని ఖరీదు చూసి అంతా నోరెళ్ల బెడుతున్నారు. బాంద్రాలోని ఆరియట్​ భవనంలో సోనాక్షి రూ.11 కోట్లతో ఫ్లాట్​ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇటీవల రూ.55 లక్షల స్టాంప్​ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ బంగ్లాలో 4 కార్లు పార్కింగ్ చేసుకునేలా సౌకర్యం ఉందంట. అంతేకాకుండా 2020 లో కూడా రూ.14 కోట్లకు బాంద్రాలో ఓ లగ్జరీ ప్లాట్ ను కొనుగులు చేసింది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది.

ప్రస్తుతం సోనాక్షి ‘ది బుక్​ ఆఫ్​ డార్క్​నెస్’​లో ఈ హీరోయిన్​ నటించనుంది. దీంతో పాటు సంజయ్​ లీలా బన్సాలీ హీరామండీ సినిమాలోనూ కీలక పాత్ర చేస్తోంది.