- ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు హైడ్రా నోటీసులను స్వాగతిస్తున్నా
సైఫాబాద్, వెలుగు: సోమాజీగూడలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్నిర్మించిన బిల్డింగ్‌కు హైడ్రా నోటీసులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ విషయంలో హైడ్రా ఒక అడుగు వెనక్కి వేస్తే తాను పది అడుగులు ముందుకు వేస్తానని స్పష్టం చేశారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు శనివారం చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్బిల్డింగ్ఎఫ్టీఎల్ లో ఉందని అప్పటి మంత్రి కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ను రక్షించేందుకు ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్త, ఎంఎస్ మక్త ప్రాంతాల ప్రజలను బీఆర్ఎస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆ బస్తీల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి ఇండ్లకు ఎలాంటి హాని జరగదని పేర్కొన్నారు. రహదారి కారణంగా ఇండ్లు కోల్పోయే వారికి స్థానికంగానే ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
