Jani Master: చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.. బెంగళూరు రేవ్ పార్టీపై జానీ సీరియస్ కామెంట్స్

Jani Master: చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.. బెంగళూరు రేవ్ పార్టీపై జానీ సీరియస్ కామెంట్స్

బెంగళూరు రేవ్ పార్టీ(Bangalore Rave Party) టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ పార్టీ పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దాంతో.. ఆ స్టార్స్ తాము ఆ పార్టీకి వెళ్లలేదని, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ పేరు కూడా ఈ రేవ్ పార్టీ విషయంపై వినిపించింది. దాంతో.. ఆయన కూడా ఈ విషయంపై స్పందించారు. తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నావాళ్ళ మధ్య ఉన్నాను. గత కొన్నిరోజులుగా తీరికలేకుండా పని చేస్తున్నాను. అలాంటి.. నన్ను ఎక్కడో, ఎవరితోనో, ఎదో చేస్తున్నట్టుగా పుకార్ల లేపారు. మా జనసేనానిని, మా సేనాని ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. నిన్నటివరకు డైరెక్టర్స్ డే ఈవెంట్ లో, ఇప్పటి వరకు హాస్పిటల్ లో ఉన్న నేను బెంగళూరు రేవ్ పార్టీలో ఎలా ప్రత్యేక్షమయ్యానో ఈ వార్త రాసిన, రాయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు ఎప్పుడు చెడగొట్టడానికే చూస్తాడు. 

ఈ వీడియో చేస్తుందో కూడా వాళ్లు ఎదో కామెంట్స్ చేశారని కాదు.. నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునేవాళ్ల కోసం. అనవసరంగా నాపై, మా జనసేనానిపై బురదజల్లే ప్రయత్నం జల్లే ప్రయత్నం ఇది. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న, చేయిస్తున్న గుంటనక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.. అంటూ చెప్పుకొచ్చాడు జానీ. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.