పబ్ లో కత్తులతో నృత్యాలు.. పార్టీ ప్రియులకు వణుకు పుట్టించిన ఆకతాయిలు

పబ్ లో కత్తులతో నృత్యాలు.. పార్టీ ప్రియులకు వణుకు పుట్టించిన ఆకతాయిలు

బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో కొందరు యువకులు కత్తులతో నృత్యాలు చేస్తూ రెచ్చిపోయారు. రోడ్డు నంబర్ 14 రాక్ క్లబ్ స్కైలాంజిలో డాన్సింగ్ ఫ్లోర్ లో కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. దీంతో పార్టీకి వచ్చిన వారంతా కత్తులను చూసి భయంతో వణికిపోయారు. మరికొందరు ఈ నృత్యాలను తమ సెల్ ఫోన్ లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.

సమాచారం అందుకున్న పోలీసులు పబ్ నిర్వహకులను, కత్తులతో నృత్యాలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.