అతనొక డెవిల్.. ఆసక్తిరేపుతున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్

అతనొక డెవిల్.. ఆసక్తిరేపుతున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్

కోలీవుడ్ స్టార్ ధనుష్(Danush)  హీరోగా తెరకెక్కిన పీరియడ్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్(Captain Miller). అరుణ్ మాథేశ్వరన్(Arun Mathershwaran) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా తమిళనాట విడుదలైంది. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీ కారణంగా కొంత ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. జనవరి 25న సినిమా విడుదలవుతున్న  క్రమంలో బుధవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. హీరోలు నాగార్జున, వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.

స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్‌‌‌‌ పరిపాలన నేపథ్యంలో సాగే కథ ఇది.  స్థానిక తిరుగుబాటు నాయకుడిగా, గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్లను ఎదుర్కొంటూ కనిపించాడు ధనుష్. బ్రిటీష్‌‌‌‌ వారు అతనని డకాయిట్ అంటుంటే, స్థానికులు దేశద్రోహి అని పిలుస్తారు. ‘నువ్వు ఎవరు, నీకు ఏం కావాలి అనే దానిని బట్టి నేనెవరో తెలుస్తుంది.. నువ్వు డెవిల్‌‌‌‌ను నమ్ముతావుగా, ఆ డెవిల్ నేనే, నన్ను ‘కెప్టెన్‌‌‌‌ మిల్లర్‌‌‌‌‌‌‌‌’ అని పిలవొచ్చు’ అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి. తన పెర్ఫార్మెన్స్‌‌‌‌తో పాటు యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు హైలైట్‌‌‌‌గా నిలిచాయి.  ప్రియాంక మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలకపాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.