రఫ్​ అండ్​ టఫ్​ రాయన్.. ధనుష్ గుండు లుక్ సూపర్

రఫ్​ అండ్​ టఫ్​ రాయన్.. ధనుష్ గుండు లుక్ సూపర్

హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. దర్శకుడిగానూ బిజీ అవుతున్నాడు ధనుష్​. రీసెంట్‌‌‌‌గా ‘కెప్టెన్ మిల్లర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన 50వ చిత్రాన్ని తానే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. సోమవారం ఈ మూవీ టైటిల్‌‌‌‌తో పాటు ధనుష్ ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. దీనికి ‘రాయన్’ అనే టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. చెఫ్ గెటప్‌‌‌‌లో డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపిస్తున్నాడు ధనుష్. వెనుక ఫుడ్‌‌‌‌ ట్రక్‌‌‌‌లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ కత్తులతో సీరియస్‌‌‌‌గా కనిపించారు.

వాళ్ల డ్రెస్సింగ్‌‌‌‌ స్టైల్‌‌‌‌ చెఫ్‌‌‌‌లా కనిపిస్తున్నా, వాళ్ల చూపులు, గెటప్‌‌‌‌లు మాత్రం మరేదో స్టోరీ ఉందనిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారు. ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌’లో ధనుష్‌‌‌‌తో కలిసి నటించిన సందీప్ కిషన్‌‌‌‌.. ఈ చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సెల్వ రాఘవన్‌‌‌‌, ఎస్‌‌‌‌జే సూర్య, అపర్ణ బాలమురళి, దుషార విజయన్‌‌‌‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌‌‌‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఆరేళ్ల గ్యాప్ తర్వాత ధనుష్​ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.